Breaking News

మీడియా అకాడమి అండగా ఉంటుంది

హైదరాబాద్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో కొత్తగా మరో 25 మంది జర్నలిస్టు\కు కరోనా పాజిటివ్‌ వచ్చినందున ఆ 25 మంది జర్నలిస్టు\కు ఒక్కొక్కరికి 20 వేల‌ రూపాయల‌ చొప్పున, హోంక్వారైంటైన్‌లో ఉన్న జర్నలిస్టుల‌కు పది వేల‌ చొప్పున, మొత్తం 5 ల‌క్షల‌ పది వేల‌ ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల‌ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటీమ్‌ వచ్చిన 56 మంది జర్నలిస్టుల‌కు 20 వేల‌ రూపాయల‌ చొప్పున 11 ల‌క్షల‌ ఇరవై వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్‌లో ఉన్న 14 మంది జర్నలిస్టుల‌కు 10 వేల‌ రూపాయల‌ చొప్పున ఒక ల‌క్ష 40 వేల‌ రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12 ల‌క్షల‌ అరవై వేల‌ రూపాయల‌ను అకాడమీ నిధుల‌ నుండి అందించామని తెలిపారు.

కరోనా బారిన పడిన పాజిటివ్‌, క్వారంటైన్‌ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్‌ రిపోర్టులు అకాడమీ కార్యాల‌యంలో పంపించాల‌ని సూచించారు. జర్నలిస్టుల‌కు తక్షణ సహాయం కింద రూ. 20 వేలు, క్వారన్‌ టైన్‌లో ఉన్న జర్నలిస్ట్‌ల‌కు రూ. 10 వేలు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నుండి అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్‌ మిత్రులు తమ వివరాల‌ను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్‌ వాట్సప్‌ (8096677444) నెంబర్‌కి పంపాల‌ని తెలిపారు.

మరిన్ని వివరాల‌కు మీడియా అకాడమీ మేనేజర్‌ సెల్‌ నెంబర్‌ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఇండ్ల నుండి బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్‌ను వాడాల‌ని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. కరోనా వైరస్‌పై అవగాహన కలిగించడంలో జర్నలిస్టుల‌ది కీల‌క పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టుల‌కు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

Check Also

జూలై 10 వరకు ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని ...

Comment on the article