Breaking News

17 మందికి నెగెటివ్‌

కామారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పంపించిన 18 మంది ప్రాథమిక సంక్రమణ దారుల‌ నమూనాలో గాంధారికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇతడికి అనుమానిత ల‌క్షణాలు వుండగా నమూనా సేకరించడం జరిగిందని, మిగతా 17మందికి నెగేటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాదుకు తరలించినట్టు తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇట్టి పాజిటివ్‌ కేసుల‌ ప్రాథమిక సంక్రమణ దారుల‌ను గుర్తించి కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ ప్రజల‌ సహకారం లేనిదే కరోన నియంత్రణ సాధ్యం కాదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా వుండాల‌న్నారు.

ఇంకా కొన్ని రోజుల‌ పాటు ప్రయాణాలు, ఫంక్షన్లకు, విందుల‌కు దూరంగా వుంటూ సామాజిక దూరం పాటిస్తూ, స్వఛ్ఛందంగా ప్రజలు లాక్‌డౌన్‌ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా .చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇట్టి కేసుల‌ విషయం పట్ల వారి ప్రాథమిక సంక్రమణ దారుల‌ పట్ల నిరంతరం అప్రమత్తంగా వుండి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నామని, కనుక జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి తగు సహకారం అందించాల‌ని కోరారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article