Breaking News

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం, బాన్సువాడ పట్టణంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేకర్‌ రావు రైతుల‌ కోసం రైతు బంధు పెట్టుబడి కోసం 7 వేల‌ కోట్ల రూపాయలు విడుదల‌ చేసిన శుభ సందర్భంలో బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి సిఎం చిత్రపటానికి, రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని గొప్ప నిర్ణయం సిఎం కెసిఆర్‌ రైతుల‌ కోసం తీసుకున్నారని, రాష్ట్రంలో ఏ రైతు కూడా పెట్టుబడి కోసం అప్పు చెయ్యకూడదని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి రూ. 10 వేలు రైతుల‌కు పెట్టుబడి కింద నేడు 7 వేల‌ కోట్ల రూపాయ‌లు మంజూరు చేశారన్నారు. రైతు బంధు కానీ, రైతు భీమా కానీ 24 గంటల‌ ఉచిత కరెంట్‌ గాని ఇలా రైతుల‌కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాల‌ను అందిస్తున్నారన్నారు.

కార్యక్రమములో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, భోర్లం ప్యాక్స్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సంగ్రామ్‌ నాయక్‌, మండల‌ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామ్‌ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, స్థానిక ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, బుడమి ప్యాక్స్‌ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, మండల‌ తెరాస పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఇబ్రహీంపెట్‌ సర్పంచ్‌ నారాయణరెడ్డి, హన్మాజిపెట్‌ ఎంపీటీసీ సుధాకర్‌ రెడ్డి, బాన్సువాడ పట్టణ తెరాస అధ్యక్షుడు పాత బాల‌కృష్ణ, మాజీ ఏఎంసి చైర్మన్‌ గురు వినయ్‌, మండల‌ నాయకులు ఎజాజ్‌, అలిముద్దీన్‌ బాబా, భోర్లం నర్సింలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article