Breaking News

నేడు ఐదు పాజిటివ్‌

నిజామాబాద్‌, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంగళవారం కొత్తగా ఐదు కారోనా పాసిటివ్‌ కేసులు నమోదైనందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రజల‌కు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా మహమ్మారి తొల‌గిపోయినట్లు కాదని, ప్రజలు కరోనాపట్ల మరింత అప్రమత్తంగా ఉండాల‌ని, జిల్లా ప్రజలందరి సహకారంతో జిల్లాలో కరోనాను కట్టడి చేయగలిగామని, ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.

ప్రతి షాపు, కార్యాల‌యంలో భౌతిక దూరం పాటించేలా, శానిటీజర్‌ ఉపయోగించేలా, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ప్రతి షాప్‌, కార్యాల‌యం ముందు నో మాస్కు, నో గూడ్స్‌, నో మాస్కు, నో సర్వీసు బోర్డ్‌లు పెట్టేలా చూడాల‌ని, పబ్లిక్‌ ప్లేస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల‌ని, కరోనా వాక్సిన్‌ వచ్చేవరకు అంతా అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు.

పట్టణ స్థాయిలో కరోనా వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నందున పరిశుభ్రత, భౌతిక దూరం పాటించటానికి ఏర్పాట్లు, అవగాహన కల్పించాల‌ని, ప్రభుత్వ ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సులువవుతుందన్నారు.

ప్రతి ప్రదేశంలో మాస్కులు, శానిటీజర్‌ వాడకం, భౌతిక దూరం పాటించడంపై పదే పదే అవగాహన కల్పించాల‌ని అన్నారు. పెద్ద దుకాణాల‌లో హాండ్‌ వాష్‌ విధిగా ఏర్పాటు చేయించాల‌ని, ఫంక్షన్స్‌, మీటింగ్‌లంటూ ఎక్కువమంది గుమికూడకుండా చూడాల‌న్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article