Breaking News

Daily Archives: June 17, 2020

పోలింగ్‌ స్టేషన్‌లు 50 కి పెంచారు

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల‌ నిర్వహణ కోసం ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ స్టేషన్లను ఆరు నుండి 50 కి పెంచినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పొలిటికల్‌ పార్టీల‌ ప్రతినిధుల‌తో సమావేశం నిర్వహించిన ఆదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ సందర్బంగా ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల‌ను డివిజన్‌ స్థాయిలో కాకుండా మండల‌ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఎల‌క్షన్‌ కమిషన్‌ అనుమతి మంజూరుచేయడం జరిగిందన్నారు. ...

Read More »

మిడతల‌ దాడుల‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల‌మేరకు రాష్ట్రంలో మిడతలు దాడిచేసే ప్రమాదమున్న 9 సరిహద్దు జిల్లా కలెక్టర్లు ఎస్‌.పిలు, ఫైర్‌, వ్యవసాయ, అటవీ శాఖ అధికారుల‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ బుధవారం బిఆర్‌ కెఆర్‌ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి పరిస్ధితుల‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల‌ని, మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న గ్రామాల‌లో చేపట్టబోయే చర్యల‌పై సూక్ష్మ స్ధాయి ప్రణాళిక తయారు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామాల‌లో ...

Read More »

చురుకుగా సాగుతున్న అభివృద్ధి పనులు

ఎల్లారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆదేశాల‌ మేరకు బుధవారం ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెంబడి వీధి దీపాలు, డివైడర్‌ పనుల‌ను స్థానిక ప్రజాప్రతినిదులు పర్యవేక్షించారు. వీధి దీపాల‌ పనులు చివరి దశకు చేరాయని, డివైడర్‌ పనులు, పెద్ద చెరువు కట్ట పనులు కూడా త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్‌, ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్‌ ...

Read More »

బాధిత కుటుంబానికి రూ.2.50 ల‌క్షల‌ చెక్కు అందజేత

బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన మావురం సాయిలు కొద్దీ రోజుల‌ క్రితం ట్రాక్టర్‌ నడుపుతుండగా వివో మొబైల్‌ ఫోన్‌ పేలి భయంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కేజ్‌ వీల్‌ కిందపడి మృతి చెందాడు. కావున వారి కుటుంబ సభ్యులు మావురం సుజాతకు మిర్జాపూర్‌ సొసైటీ తరుపున బుధవారం నిజామాబాద్‌ జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రమాద భీమా రూ. 2 ల‌క్షల‌ 50 వేల‌ చెక్కు ...

Read More »

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సిఎం

కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా (ఎన్‌ఆర్‌ఇజిఏ) పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ను, కాలువ‌ల్లో పూడిక తీత పనులు, కాలువ‌ల‌ మరమ్మతు పనుల‌ను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల‌, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్‌, సిక్తా పట్నాయక్‌, ఆర్‌.వి. కర్ణన్‌ను అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కల‌ను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు అభినందించారు.

Read More »

సిఎం మార్గనిర్దేశాల‌కు అనుగుణంగా ఆదేశాలు

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టర్స్‌ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశకాల‌కు అనుగుణంగా జిల్లా అధికారుల‌కు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తూ ప్రత్యేక పారిశుభ్రత కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ ల‌లో ప్రతిరోజూ పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టాల‌ని, కంపోస్ట్‌ షెడ్లు, స్మశానవాటికల‌ను వెంటనే పూర్తిచేయాల‌ని, గ్రామ పంచాయితీకి సంబంధించిన కరంట్ బిల్లుల‌ను వెంటనే చెల్లించని పక్షంలో సంబంధిత గ్రామ సర్పంచ్‌, సెక్రెటరీపై ...

Read More »

గురువారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 18న గురువారం ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని ఆనంద్‌నగర్‌, సీతారామ్‌నగర్‌, సాయినగర్‌, ఇపిఎప్‌ కార్యాయం వెనక, రోటరీనగర్‌, సూర్యనగర్‌, అయోధ్యనగర్‌ ప్రాంతాల‌లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల‌ నుంచి సాయంత్రం 6 గంటల‌ వరకు నాగారం, వడ్డెర కాల‌నీ, గొల్ల‌గుట్ట, 50, 80, ...

Read More »

భక్తుల‌కు గమనిక…

భీమ్‌గల్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింబాద్రి గుట్ట పైన శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవాల‌యము కేవల‌ము 10 నుండి 65 సంవత్సరముల‌ మధ్య వయసు కల‌ భక్తుల‌ దర్శనాల‌కై మాత్రమే అనుమతించబడినట్లు దేవాదాయ శాఖ సహాయ కమీషనర్‌ సోమయ్య పేర్కొన్నారు. వేరే ఎటువంటి కార్యక్రమమునకు, వంటలు భోజనాల‌కు అనుమతి లేదని, అతిక్రమించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని వివరించారు.

Read More »

సంతోష్‌బాబు త్యాగం వెల‌కట్టలేనిది

హైదరాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన క‌ల్న‌ల్‌ బిక్కుమ‌ల్ల‌ సంతోష్‌ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెల‌కట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్‌ తల్లిదండ్రులు, భార్యాపిల్ల‌లు, ఇతర కుటుంబ సభ్యుల‌కు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. సంతోష్‌ ...

Read More »