Breaking News

చురుకుగా సాగుతున్న అభివృద్ధి పనులు

ఎల్లారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆదేశాల‌ మేరకు బుధవారం ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెంబడి వీధి దీపాలు, డివైడర్‌ పనుల‌ను స్థానిక ప్రజాప్రతినిదులు పర్యవేక్షించారు. వీధి దీపాల‌ పనులు చివరి దశకు చేరాయని, డివైడర్‌ పనులు, పెద్ద చెరువు కట్ట పనులు కూడా త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్‌, ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు.

పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్‌ కాంతుల‌తో విరాజిల్లుతుందని ఎమ్మెల్యే అండతో పెద్ద చెరువు పనులు తొందరగా పూర్తవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు అల్లం శ్రీను, బుంగారి రాము, ఎరుక సాయిలు, పిఏసిఎస్‌ చైర్మన్‌ ఎగుల‌ నర్సింలు, పిఏసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌, నాయకులు నునుగొండ శ్రీనివాస్‌, గండి మాసానిపెట్‌ రాజు, సతీష్‌, ఇమ్రాన్‌, ఫస్సి, నాగం సాయిబాబు, నాగం గోపి, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా నిర్వహించే విధంగా అధికారులు ...

Comment on the article