Breaking News

Daily Archives: June 18, 2020

మన జిల్లాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న మిడతలు మన జిల్లాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారుల‌కు సూచించారు. ఈ సందర్భంగా మిడతలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనే విధంగా సన్నద్ధమై ఉండాల‌ని, మిడతలు గుంపులుగా వస్తాయని, అవి దాడి చేస్తే విపరీతమైన నష్టం కలుగుతుందని, ఏ పంట అని సంబంధం లేకుండా పచ్చగా ఉన్న ప్రతి మొక్కను తింటాయని, ...

Read More »

భావితరాల‌కు చక్కటి వాతావరణం అందించాలి

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భావితరాల‌కు చక్కటి వాతావరణాన్ని అందించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురువారం తడి, పొడి చెత్త వేరు చేయడం వ‌ల్ల‌ కలిగే లాభాల‌పై గ్రామస్తుల‌కు అవగాహన కల్పించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల‌ని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొల‌గించి, వర్షపు నీరు గుంతల్లో నిల‌వకుండా చూడాల‌ని కార్యదర్శుల‌ను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల‌ విషయంలో ...

Read More »

ఆర్మీకి సహాయం చేసేందుకు ఏబివిపి సిద్ధం

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ ఎబివిపి ఇందూర్‌ శాఖ ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చందా అనిల్‌ మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం పని చేస్తున్నటువంటి సైనికుల‌ను దొంగ దెబ్బ తీసిన చైనా సైనికుల‌కు త్వరలోనే బుద్ధి చెప్తామని అవసరమైతే ఆర్మీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఏబీవీపీ ముందుంటుందని తెలిపారు. దేశంలో చైనా వస్తువులు పూర్తిగా బందు చేసే విధంగా విద్యార్థుల‌తో ...

Read More »

అమర సైనికుల‌కు బిజెపి నివాళులు

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌- చైనా సరిహద్దులో శాంతి చర్చల‌ మాటున చైనా దొంగచాటుగా దాడి చేసిన ఘటనలో మన సైనికులు మరణించడం, అమరుడైన తెలంగాణ బిడ్డ క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు మరియు అమరులైన భారత సైనికుల‌కు బిజెపి నిజామాబాద్‌ జిల్లా పార్టీ కార్యాల‌యంలో నగర శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌ పాల్‌ సూర్య నారాయణ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు ప్రాణత్యాగాన్ని దేశం ...

Read More »

పిపిఇ కిట్ల వితరణ

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా కోవిడ్‌ ` 19 స్వస్థత కార్యకలాపాల‌లో పెద్ద ఎత్తున చురుకుగా పాల్గొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌బిఐ ఫౌండేషన్‌ ద్వారా కోటి పది ల‌క్షల‌ రూపాయల‌ ఖర్చుతో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా ఆహారం మరియు గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల‌కు వైద్య సామగ్రి, 6 వేల పిపిఇ కిట్లు సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఒ.పి.మిశ్రా, తెలంగాణ రాష్ట్ర ...

Read More »

పభుత్వ డిగ్రీ కళాశాల‌ ఆస్తుల‌ జోలికొస్తే ఊరుకునేది లేదు

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ భూముల‌ను కొందరు భూ కబ్జాదారులు కబ్జా చేశారని కళాశాల‌ భూముల‌ జోలికొస్తే ఊరుకునేది లేదని ఐక్య విద్యార్థి సంఘాల‌ ఆధ్వర్యంలో కళాశాల‌ భూముల‌ను పరిశీలించినట్లు విద్యార్థి సంఘాల‌ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్‌ డిగ్రీ కళాశాల‌ భూముల్ని కళాశాల‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తానని హామీ ఇవ్వడంతో అనేక ఉద్యమాల‌ నేపథ్యంలో కళాశాల‌ భూములు తిరిగి కళాశాల‌కు అప్పగించడం జరిగిందని, కానీ ...

Read More »

కేకు కట్‌చేయొద్దు… అన్నదానం చేయండి….

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ బర్త్‌డే వేడుకల‌ను కేకే కట్‌ చేయకుండా పేదల‌కు అన్నదానం, అనారోగ్యంతో ఉన్నవారికి పాలు పండ్లు పంపిణీ చేయాల‌ని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల‌న నా దేశ ప్రజలందరూ ఆకలితో అల‌మటిస్తున్న వేళ అనాధలుగా ప్రాణాలు వదులుతున్న వేళ నేను నా పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుంటానని, నా జీవితంలో ఇలాంటి దుర్దినాలు ఎప్పుడూ ...

Read More »

వేతన బకాయిలు చెల్లించాలి

నిర్మల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్‌ నిర్మల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ఆర్‌డివోకు వినతి పత్రం అందజేశారు. జూన్ నెల‌ నుండి పూర్తి వేతనాలు చెల్లించాల‌ని అలాగే మార్చి నెల‌ నుండి మే నెల‌ బకాయిలు చెల్లించాల‌ని కోరారు. అదేవిధంగా వెంటనే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాల‌ని అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించి 60 శాతంతో కూడిన పిఆర్‌సి అమలు చేయాల‌న్నారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దు

హైదరాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదల‌య్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల‌ను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాల‌యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల‌ చేశారు. ఫస్టియర్‌లో 60.1 శాతం, సెకండియర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్ల‌డిరచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారన్నారు. ఈ సారి ఫలితాల్లో కూడా బాలికల‌దే పైచేయి అన్నారు. ఈ నెల‌ 22 వరకు కాలేజీల‌కు మార్కుల‌ మెమోలు అందనున్నట్లు ...

Read More »

సైనిక లాంఛనాల‌తో ఆర్మి క‌ల్న‌ల్‌ అంత్యక్రియలు

సూర్యపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాల‌తో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌ బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సంస్కారాల‌ ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా వ‌ల్ల‌ పరిమిత సంఖ్యలో అంత్యక్రియల‌కు అనుమతించారు. అంతకుముందు విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు ...

Read More »

చైనా వస్తువులు బహిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చైనా సైనికులు దొంగచాటుగా జరిపిన దాడిలో భారత ఆర్మీ క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు మృతికి టిఎన్‌ఎస్‌ఎఫ్‌, విజేఎస్‌ విద్యార్థి విభాగాల‌ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, విజెఎస్‌ జిల్లా అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌ యాదవ్‌ మాట్లాడుతూ దొంగచాటుగా దెబ్బతీసి భారత సైనికులు 20 మందిని చైనా సైనికులు చంపడం సిగ్గుచేటని సైనికుల‌ మీద జరిగిన దాడి దేశ ప్రజల‌ మీద జరిగిన దాడిగా భావించాల‌ని అన్నారు. ...

Read More »

క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుటుంబానికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం

నిజామాబాద్‌ ప్రతినిధి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణల్లో వీరమరణం పొందిన తెలంగాణ సూర్యాపేట ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుటుంబానికి ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తరపున ఆ శాఖ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌పి స్టేట్‌ లీడర్‌ ఉప్పల‌ శ్రీనివాస్‌ గుప్త రూ. ల‌క్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. క‌ల్న‌ల్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉప్పల‌ శ్రీనివాస్‌ భారతజాతి కోసం ఆర్యవైశ్య బిడ్డ చేసిన ప్రాణత్యాగం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ...

Read More »