Breaking News

పిపిఇ కిట్ల వితరణ

నిజామాబాద్‌, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా కోవిడ్‌ ` 19 స్వస్థత కార్యకలాపాల‌లో పెద్ద ఎత్తున చురుకుగా పాల్గొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌బిఐ ఫౌండేషన్‌ ద్వారా కోటి పది ల‌క్షల‌ రూపాయల‌ ఖర్చుతో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా ఆహారం మరియు గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల‌కు వైద్య సామగ్రి, 6 వేల పిపిఇ కిట్లు సరఫరా చేస్తుంది.

ఈ సందర్భంగా ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఒ.పి.మిశ్రా, తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌ కుమార్‌ను కలిసి పిపిఇ కిట్‌ బాక్సు అందజేశారు. వీటిని గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల‌కు అందజేయాల‌ని నిర్ణయించారు.

ఇందులో భాగంగా గురువారం వెయ్యి పిపిఇ కిట్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతుల‌ మీదుగా ఎస్‌బిఐ ఆర్‌అండ్‌డిబి రీజనల్‌ మేనేజర్‌ కె.ప్రతాప్‌రెడ్డి, ఎస్‌బిఐ ఎఫ్‌ఐఎంఎం రీజనల్‌ మేనేజర్‌ టి.వి.రమణ సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.నాగేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడి డాక్టర్‌ ప్రతిమ, ఆర్‌ఎంఓ విశాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ చీఫ్‌ మేనేజర్‌ భగవాన్‌ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article