Breaking News

Daily Archives: June 19, 2020

బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మరియు మార్కుఫెడ్‌ సంస్థ ద్వారా సబ్సిడీపై రైతుల‌కు సరఫరా చేసిన సోయా విత్తనాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సరైన రీతిలో మొకెత్త లేదని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో వ్యవసాయశాఖ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు, ఏ ప్రాంతంలో అయితే ఈ సోయా విత్తనాలు మొల‌కెత్త లేదని నిరూపితమైందో ఆయా రైతుల‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, అట్టి రైతుల‌కు న్యాయం జరిగేలా ...

Read More »

చిరు వ్యాపారుల‌కు పదివేలు

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో నివసిస్తూ సంచార చిరు వ్యాపారం అనగా రోడ్డుపై కూర్చుని మరియు తిరుగుతూ పండ్లు, కూరగాయలు, రొయ్యలు, ఎండు చేపలు, పాలు పోయడం, రోడ్డుపై మాంసం విక్రయించడం, రోడ్డుపై వాహనాలు రిపేర్‌ చేయడం మరియు రోడ్డు పై తిరుగుతూ మరియు కుర్చుని ఏదైనా చిరు వ్యాపారం చేసేవారు ఉంటే వారికి ప్రభుత్వం రూ. 10 వేలు బ్యాంక్‌లోన్‌ ఇప్పిస్తున్నారు. కావున కామారెడ్డి మున్సిపల్‌ ఆఫీసులోని మెప్మా కార్యాల‌యంలో సంబంధిత అధికారి ...

Read More »

26 వరకు ఎంఎడ్‌ పరీక్షల‌ ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయం పరిధిలోని అన్ని అనుబంధ ఎం.ఎడ్‌. కళాశాల‌లోని మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 26వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆల‌స్య రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు జూలై / ఆగస్ట్ నెల‌లో నిర్వహింపబడుతాయని పేర్కొన్నారు. కావున ఎం.ఎడ్‌. కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ ...

Read More »

శనివారం నగరంలో కరెంటు ఉండదు

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ శనివారం పురస్కరించుకొని ఈనెల‌ 20న విద్యుత్‌ ఉపకేంద్రాల‌ వద్ద నెల‌వారి మరమ్మతుల‌ కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ అధికారి అశోక్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల‌ వరకు అంతరాయం ఉంటుంది కాబట్టి నిజామాబాద్‌ పట్టణ విద్యుత్‌ వినియోగదారులు గమనించి సహకరించాల‌న్నారు.

Read More »

ఆరోగ్య సిబ్బందికి సన్మానం

బీర్కూర్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు రాహుల్‌ గాంధీ 50 వ జన్మదినం సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, కామారెడ్డి జిల్లా ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనా వైరస్‌తో ప్రజలు చనిపోతుంటే మరో వైపు భారత చైనా సరిహద్దులో 20 మంది జవానులు ...

Read More »

సామాన్య ప్రజల‌ పట్ల సిఎంకు చిత్తశుద్ధి లేదు

కామరెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్బంగా నిరుపేదల‌కు నిత్యావసర సరుకుల‌ను మాజీ మంత్రి మాజీ, మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత్‌ చైనా బార్డర్లో 20 మంది సైనికులు మృత్యువాత పడటం చాలా బాధాకరమైన విషయమని, సైనికుల‌ మరణంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణకు చెందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు మృతి చెందితే గవర్నర్‌ లాంటి ...

Read More »

27 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయం పరిధిలో అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాల‌లోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌, మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూ మెంట్స్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 27 వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆల‌స్య రుసుముతో ఈ నెల‌ 30 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు జూలై నెల‌లో నిర్వహింపబడుతాయన్నారు. కావున ...

Read More »

కోవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్‌ అందజేత

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు సిబ్బందికి కోవిడ్‌-19 నుంచి రక్షించుకోవడం కోసం ఫేస్‌ మాస్కులు, పి.పి.ఈ కిట్లు, హ్యాండ్‌ గ్లోవ్స్‌, ఇతర వస్తువులు నేషనల్‌ అండ్‌ స్టేట్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సూచనల‌ మేరకు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాదు జిల్లా చైర్మన్‌ డా.నీలి రాంచందర్‌ మాట్లాడుతూ బ్లడ్‌ బ్యాంకు ఒక అత్యవసర విభాగం కాబట్టి రోజుకి ఎంతో మంది రోగుల‌ బంధువులు వస్తుంటారు కాబట్టి మనల్ని మనం ముందు కాపాడుకొని ...

Read More »

రోగుల‌కు పండ్ల పంపిణీ

ఎల్లారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి రోగుల‌కు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. అనంతరం కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందిని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉషగౌడ్‌, ఎంపీపీ మాధవి, వైస్‌ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింలు, పార్టీ మండల‌ అధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హఫీజ్‌, మున్సిపల్‌ ...

Read More »