Breaking News

రోగుల‌కు పండ్ల పంపిణీ

ఎల్లారెడ్డి, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి రోగుల‌కు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. అనంతరం కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందిని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి సన్మానించారు.

కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉషగౌడ్‌, ఎంపీపీ మాధవి, వైస్‌ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింలు, పార్టీ మండల‌ అధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హఫీజ్‌, మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు మహేశ్వరి, విజయల‌క్ష్మి, బాల‌మణి, నాయకులు బారాజు గౌడ్‌, విద్యాసాగర్‌, రాము, చిరంజీమి, పరందాములు, నారగౌడ్‌, పోచయ్య, రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి ఎంపిటిసి పార్వతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జహీరాబాద్‌ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి ...

Comment on the article