Breaking News

ఆరోగ్య సిబ్బందికి సన్మానం

బీర్కూర్‌, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు రాహుల్‌ గాంధీ 50 వ జన్మదినం సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, కామారెడ్డి జిల్లా ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనా వైరస్‌తో ప్రజలు చనిపోతుంటే మరో వైపు భారత చైనా సరిహద్దులో 20 మంది జవానులు అమరులైనారన్నారు.

అందులో మన రాష్ట్రానికి చెందిన సూర్యాపేట ముద్దు బిడ్డ క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు అమర వీరుడైన సందర్భంగా రాహుల్‌ గాంధీ తన పుట్టిన రోజు వేడుకలు కేకులు, బాణా సంచా పేల్చి చేయొద్దని, కరోనా విపత్తు సమయంలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, పోలీసులు తమ ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి కుటుంబ సభ్యుల‌కు దూరంగా ఉండి దేశ ప్రజల‌కు చేస్తున్న సేవల‌ను గుర్తించి వారిని సన్మానించాల‌ని పిలుపునిచ్చారన్నారు.

దీంతో ఆరోగ్య సిబ్బందిని సన్మానించామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీద ప్రజల‌కు అన్న దానం చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సానెపు గంగారాం, మాజీ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు రాచప్ప పటేల్‌, బాన్సువాడ మండల‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌, రామ్మోహన్‌ మీర్జా పూర్‌, ఎండీ నసీమొద్దీన్‌, టౌన్‌ అధ్యక్షుడు నాగరాజు, పోతు వెంకటేశం, అహ్మద్‌ హుస్సేన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పోగు పాండు, ఖదీర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, ఎన్‌ఆర్‌ఐ రషీద్‌ అన్వర్‌, అహ్మద్‌ భాషా, అఖిలేష్‌ గౌడ్‌, మాజీ ఎంపిటిసి శేఖర్‌ గౌడ్‌, మాజీ వార్డు మెంబర్‌ డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ ...

Comment on the article