Breaking News

కోవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్‌ అందజేత

నిజామాబాద్‌, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు సిబ్బందికి కోవిడ్‌-19 నుంచి రక్షించుకోవడం కోసం ఫేస్‌ మాస్కులు, పి.పి.ఈ కిట్లు, హ్యాండ్‌ గ్లోవ్స్‌, ఇతర వస్తువులు నేషనల్‌ అండ్‌ స్టేట్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సూచనల‌ మేరకు అందజేశారు.

ఈ సందర్భంగా నిజామాబాదు జిల్లా చైర్మన్‌ డా.నీలి రాంచందర్‌ మాట్లాడుతూ బ్లడ్‌ బ్యాంకు ఒక అత్యవసర విభాగం కాబట్టి రోజుకి ఎంతో మంది రోగుల‌ బంధువులు వస్తుంటారు కాబట్టి మనల్ని మనం ముందు కాపాడుకొని తరువాత ఇతరుల‌ని కాపాడాల‌న్నారు. అలాగే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ తరచు చేతులు సబ్బుతో గాని శానిటైజర్‌తో కానీ కడుక్కోవాల‌ని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుస్స ఆంజనేయులు, స్టేట్‌ ఈ.సి మెంబర్‌ తోట రాజశేఖర్‌, పీ.ర్‌.ఓ రామకృష్ణ, బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article