Breaking News

Daily Archives: June 20, 2020

టార్గెట్లు ప్రణాళికాబద్దంగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం మొదలైనందున వ్యవసాయ శాఖ అధికారులు తమకు కేటాయించిన టార్గెట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాల‌ని, వీలైతే ముందుగా పూర్తి చేసేలా ప్రయత్నించాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని వ్యవసాయ అధికారుల‌తో రైతు బంధు, పంట రుణాల‌ మాఫీ, మిడతల‌దండు దాడి తదితర అంశాల‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు మరింత అప్రమత్తతతో తమకు కేటాయించిన విధుల‌ను మార్గదర్శకాల‌ను పాటిస్తూ ...

Read More »

9 కిలోమీటర్ల మేర హరితహారం మొక్కలు

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నె 25న మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో జిల్లా ఉన్నత స్థాయి అధికారుల‌తో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. హరితహారం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి రానున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రధాన రోడ్లకిరువైపులా మొక్కలు నాటాల‌ని సూచించారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ...

Read More »

చెత్త బుట్టలు ఉపయోగించాలి

నిజాంసాగర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాల‌యంలో ఎంపీడీవో తోట పర్బన్నా, ఏపీవో అబ్బా గౌడ్‌, సర్పంచ్ ల‌క్ష్మీనారాయణ కలిసి గ్రామస్తుల‌కు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలెవ్వరు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు.

Read More »

సోమవారం నుంచి గ్రామాల‌లో తనిఖీలు

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల‌ అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల‌ను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని, గ్రామాల్లో చేపట్టే ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనులు పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలోనే జరగాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం స్థానిక రాహుల్‌ గాంధీ ఆడిటోరియంలో మరియు ఆర్మూర్లో గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం మరియు ఆదాయ వ్యయాల‌పై ఎంపివోలు, పంచాయతీ సెక్రెటరీల‌కు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాంటే పల్లెలు అభివృద్ధి ...

Read More »

ప్రజల‌కు సౌకర్యంగా టాయిలెట్ల నిర్మాణం

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరమైన ఏర్పాట్లతో కూడిన టాయిలెట్ల డిజైన్లు మరియు రేట్లు ఫైనల్‌ చేసి సర్వీస్‌ మరియు మన్నికను బేరీజు వేస్తూ సోమవారం లోపు ప్రపొసల్స్‌ సమర్పించాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కమిటీ సభ్యుల‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిజామాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించుటకు, టాయిలెట్ల డిజైన్‌ మరియు ఎస్టిమేట్లు తయారు చేయడం కోసం ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ సూపరింటెండిరగ్‌ ఇంజినీర్లతో నియమించిన కమిటీ ...

Read More »

మెటీరియల్‌ తరలించేందుకు రోడ్డు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డులోని కొత్త కలెక్టరేట్‌, డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల‌ని ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌ మరియు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం కొత్త కలెక్టరేట్‌ పక్కన నిర్మాణంలో ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వర్షాకాలం నీరు వచ్చి నిలిచిపోవడం వ‌ల్ల‌ నిర్మాణం చేయలేకపోతున్న విషయాన్ని తెలుసుకొని నీటిని ...

Read More »

అవార్డు కొరకు దరఖాస్తుల‌ ఆహ్వానం

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాల‌ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల‌ నుండి 2019 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును మానవ వనరుల‌ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఢల్లీి వారు ఆహ్వానిస్తున్నారు. ఎంహెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తును ఈనెల‌ 20 నుంచి జూలై 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ...

Read More »

అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయించొద్దు

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆసక్తి కలిగిన బుక్‌ షాపు యజమానులు నిర్దేశిత ప్రయివేటు పబ్లిషర్స్‌కు 2020-21 విద్యాసంవత్సరానికి జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల‌కు అవసరమైన పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్‌, సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, సంచాల‌కులు, జాతీయ పాఠ్య పుస్తకాల‌ ప్రింటింగ్‌ హైదరాబాద్‌ వారు అనుమతినిచ్చారు. కాబట్టి నిర్దేశిత పబ్లిషర్స్‌ నుండి పాఠ్యపుస్తకాలు పొంది కామారెడ్డి జిల్లాలో విక్రయించటానికి బుక్‌షాపు యజమానులు తమ పేర్లు ఉపవిద్యాశాఖాధికారి కామరెడ్డి కార్యాల‌యంలో నమోదు చేయించుకోవాల‌ని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ...

Read More »

రైతు ఆత్మహత్య

పెద్దపల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దపల్లి జిల్లా కాల్వ‌ శ్రీరాంపూర్‌ తహశీల్దార్‌ కార్యాల‌యం ముందు రైతు ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. రెడ్డిపల్లికి చెందిన మంద రాజి రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం 20 గుంటల‌ భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, వీఆర్వో గురు మూర్తి, స్వామి పేర్లు సూసైడ్‌ నోట్‌లో రాశాడు.

Read More »

మత్స్యకారుల‌కు క్రెడిట్‌ కార్డులు

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మత్స్యకారులు పిఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా బ్యాంకు నుండి రుణ సౌకర్యం పొందడానికి ఆసక్తి గల‌వారు జిల్లా బ్యాంకుల‌ను సంప్రదించి లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాల‌ని ఫిషరీస్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, జిల్లా మత్స్య శాఖ అధికారి యం.రాజారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్ వల‌లు, తెప్పలు కొనుగోలు చేసుకోవడానికి రూ.30 వేలు, మత్స్యకార సంఘాల‌ సభ్యుల‌కు వ్యాపారం చేసుకోవడానికి రూ.25 వేలు, ఆర్‌.ఏ.ఎస్‌ (రి సర్క్యులేటరీ ఆక్వాక్చర్‌ సిస్టమ్‌) పథకం క్రింద ...

Read More »