Breaking News

నేటి నుండి ఆషాడ మాసం

నిజామాబాద్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం, వారాహి దేవి నవరాత్రం మొదల‌వుతుంది. సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు. వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు. ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనపడుతున్నాయి. వాటిలో ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే నవరాత్రులు. ఈ నవరాత్రుల‌కి వారాహీ నవరాత్రులు అని చెప్పడం ఉన్నది.

యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీ దేవి. ఈ శక్తికి సంబంధించిన మంత్రాల‌కు గురూపదేశం వంటివి ఉండాలి. కానీ తల్లిగా కొలుచుకునేటపుడు ఆమె యొక్క స్తోత్రాదులు, ‘‘శ్రీవారాహీ దేవ్యై నమః’’ మొదలైన నామముతో ఈ తొమ్మిది రోజులు పూజించడానికి ఇతర దేవతా పూజల‌కు పాటించే సాధారణ నియమములు సరిపోతాయి.

ఇచ్ఛ, జ్ఞాన క్రియా శక్తుల‌లో, క్రియా శక్తికి ప్రతీక వారాహీదేవి. కిరాత వారాహి, భైరవి, స్వప్న వారాహి ఈ విధంగా ఎన్నో రూపాల‌తో, నామాల‌తో అనుగ్రహించే తల్లి. ఈ తొమ్మిది రోజులూ వారాహీ దేవి ప్రీతికి శ్రీ ల‌లితా సహస్రనామ, ల‌లితాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాదులు చేసి దేవియొక్క అనుగ్రహము పొందవచ్చు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article