Breaking News

సార్‌ చూపిన బాటలో పయనిద్దాం

బీర్కూర్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో సార్‌కు ఘన నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి 1952 ముల్కి ఉద్యమం ద్వారా బీజం వేశారని తరువాత 1954 లో విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకముగా పోరాడారన్నారు.

1934 ఆగష్టు 6 న వరంగల్‌ జిల్లా అక్కంపేటలో ల‌క్ష్మి కాంతారావు వరల‌క్ష్మమ్మ దంపతుల‌కు జన్మించిన జయశంకర్‌ ఐదు దశాబ్దాలుగా తెలంగాణ కొరకు పోరాడి, యావత్‌ జీవితాన్నే ధార పోశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల‌ సమస్యల‌పై ఆయన తయారు చేసిన పత్రాలే 610 జీఓకు ఆధారాల‌య్యాయని, తెలంగాణ ఉద్యమానికి అవే పునాదుల‌య్యాయని వివరించారు. చివరికి తెలంగాణ రాష్ట్రం రాక ముందే జూన్‌ 21, 2011 లో ఆయన కన్ను మూసారన్నారు.

ఆయన చూపిన బాటలో పయనిస్తూ బంగారు తెలంగాణ సాకారానికి శ్రమించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అబ్దుల్‌ అహ్మద్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సానెపు గంగారాం, మాజీ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షు రాచప్ప పటేల్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, పోతు వెంకటేశం, యమ రాము, అహ్మద్‌ హుస్సేన్‌, నారం హన్మాండ్లు, ఖదీర్‌, సాయిలు మరాజ్‌, ఆజీస్‌, మేక సురేష్‌, కామయ్య, శివరాజ్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ...

Comment on the article