Breaking News

భూమి సాగుకు అధికారులు సహకరించాలి

కామారెడ్డి, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ గ్రామంలోని పేద ప్రజలు, దళితులు అసైన్‌ మెంట్‌ భూములు, ఫారెస్ట్‌ భూములు గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు, రైతుల‌కు యధావిధిగా వ్యవసాయం చేసుకోమని గత ఎన్నికల‌ ముందు కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేదల‌కు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని భూమిలేని పేదలందరికీ సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించి వారికి న్యాయం చేయాల‌ని ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా క్షేత్ర సందర్శనకు వెళ్లిన పార్టీ బృందం అక్కడున్న భూములు గత 50 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటూ తమ కుటుంబాల‌ను పోషించుకుంటూ ఉన్నారని, ప్రస్తుతం మాచారెడ్డి మండల‌ చౌకీదార్‌ పట్టా భూములు సాగు చేయొద్దని బెదిరింపుల‌కు పాల్ప‌డిన విషయాన్ని ఎంసిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలైన దళితులు, బీసీలు అట్టి భూమిని ఆధారంగా చేసుకుని జీవితాలు వెళ్లదీస్తున్నారన్నారు.

ఫారెస్ట్‌ అధికారులు వారి ల‌క్ష్యం మేరకు చెట్లు నాటే కార్యక్రమానికి పేద ప్రజలు అడ్డురాకుండా వారు వేసే వారు పంటపొలాల‌ గట్లపై చెట్లు నాటి ఫారెస్ట్‌ అధికారుల‌కు సహకరిస్తారని అన్నారు. అయినా కూడా ఫారెస్ట్‌ అధికారులు మొండికేస్తే ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో అట్టి భూమిని పేదలు సాగులో చేసుకునేందుకు వీలుగా భూ పోరాటానికి సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజవ్వ, మ‌ల్ల‌య్య, నర్సా గౌడ్‌, పంజాబ్‌ పార్టీ నాయకులు కర్ణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article