Breaking News

దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

నిజామాబాద్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ప్రతి ఆదివారం 10 గంటల‌కు 10 నిమిషాల‌ కార్యక్రమం అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. మంత్రి వర్యులు కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల‌కు పది నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని మారుతి నగర్‌ పరిసరాల్లో నిర్వహించారు.

నిలువ ఉన్న నీటిలో దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌ వేశారు. మేయర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి.పాటిల్‌, కార్పొరేటర్లు విక్రమ్‌ గౌడ్‌, సాయివర్ధన్‌, బట్టు రాఘవేందర్‌, ధర్మపురి, మల్లేష్‌ అరుణ్‌ యమునా, అనిల్‌ తదితరులున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article