Breaking News

వచ్చే శనివారం లోపు సర్వం సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీలో పనిచేసే వర్కర్లు ఎవరూ ఆఫీసులో ఉండరాదని, పీల్డ‌లోనే ఉండేలా చూడాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని ఎంపిడివోలు, ఎంపీఓలు, సంబందిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫెరెన్సులో మాట్లాడారు.

సోమవారం నుంచి జిల్లాలోని గ్రామాల్లో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు చేయాల‌ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందుకు అవసరమైన తట్టలు, పారలు, చీపుర్లు, తోపుడు బండ్లు, గ్లౌజులు, గంషూస్‌ వంటి మెటీరియల్‌ను రెడి చేసుకోవాల‌ని, ఈ మెటీరియల్‌ రేట్లను మున్సిపల్‌ అధికారుల‌తో సంప్రదించి ఫైనల్‌ చేయాల్సిందిగా అదనపు కలెక్టర్లను ఆదేశించారు. వీటితో పాటు ప్రతి గ్రామానికి శానిటేషన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాల‌ని, వచ్చే శనివారం లోపు సర్వం సిద్ధం చేసుకోవాల‌న్నారు.

హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25 వ తేదీన ప్రారంభించాల‌ని, హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో ప్రతి 400 మొక్కల‌కు, ఇన్స్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌లో ప్రతి 1000 మొక్కల‌కు వాచ్‌ అండ్‌ వార్డ్‌ క్రింద ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ఒక మనిషిని నియమించుకోవచ్చని, ప్రతి గ్రామంలో 2000 మొక్కల‌కు పైబడి రోడ్ల పక్కన నాటినట్లయితే ఐదుగురిని గ్రామ వన సేవకులుగా నియమించుకొని వారికి కూడా కొంతవరకు అదనపు మొత్తం చెల్లించి ఉపయోగించుకోవచ్చన్నారు.

గ్రామ పంచాయతీ మీటింగుల‌కు వర్కర్లను వాడవద్దని, ఇకపై విఆర్‌ఏల‌ ను ఉపయోగించుకోవాల‌న్నారు. పంచాయతీ సిబ్బందికి, గ్రామవన సేవకుల‌కు ఎప్రాన్లు తయారు చేయించి అందించాల‌ని, వైకుంఠ ధామాలు, డంప్‌ యార్డుల‌ చుట్టూ గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి విలేజ్‌ పార్క్‌ అందంగా తయారుచేయాల‌న్నారు. బుధవారంలోపు గ్రామ స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్తిస్థాయిలో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు.

Check Also

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు ...

Comment on the article