Breaking News

స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు

నిజామాబాద్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో భావజాల‌ వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ప్రతీ ఒక్కరూ సార్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ్‌ గౌడ్‌, సాయివర్ధన్‌, బట్టు రాఘవేందర్‌, ధర్మపురి, మల్లేష్‌ అరుణ్‌ యమునా, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article