Breaking News

2 బిహెచ్‌కెపై సమీక్ష

నిజామాబాద్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరైన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి వచ్చే దసరా రోజున ప్రారంభించే విధంగా వీలైనన్ని ఎక్కువ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ తన కాంప్‌ కార్యాల‌యంలో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌, హోసింగ్‌ శాఖ అధికారుల‌తో జిల్లాలోని నియోజక వర్గాల‌ వారీగా డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ అర్బన్‌ ప్రాంతంలోని నాగారంలో మొదటి దశ ఇండ్లు పూర్తయిన వాటికి మిషన్‌ భగీరథ నీటి సరఫరాలోని ఇబ్బందులు తొల‌గించాల‌ని, సేవరేజి కనెక్షన్లు పూర్తిచేయాల‌ని, రెండవ దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న స్థలంలో వెంటనే ప్రారంభించాల‌న్నారు. అలాగే కొత్త కలెక్టరేట్‌ పక్కన నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల‌ ఇళ్ల పని వేగవంతం చేయాల‌న్నారు. రెండు పడక గదుల‌ ఇళ్ల నిర్మాణం చేసే స్థలంలో ఎవరికైనా పట్టాలు ఉంటే వారికి కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని అన్నారు.

ఇతర నియోజక వర్గాల‌లో మంజూరైన ఇళ్లను స్థలం విషయంలో ఇబ్బందులుంటే రెవిన్యూ అధికారుల‌తో సంప్రదించి పరిష్కరించుకోమని, ఇసుక విషయంలో ఎటువంటి అవాంతరాలు లేవని, రెండు పడక గదుల‌ ఇళ్లకు అవసరమైన ఇసుక వెంటనే కేటాయించమని ఆర్డీవోకు సూచించినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలోని అన్ని రెండు పడక గదుల‌ ఇళ్ళ సైట్లకి మిషన్‌ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వాలిసిందిగా మిషన్‌ భగీరథ ఎస్‌ఇకి, కరెంట్‌ సప్లై వీలైనంత తక్కువ రేటులో ఇవ్వాలిసిందిగా విద్యుత్‌ శాఖ ఎస్‌ఇకి సూచించారు. ఈ నెల‌ 26 వ తేదీ నుండి రెండు పడక గదుల‌ ఇళ్ల విషయంలో మరొక్కసారి సమీక్ష నిర్వహిస్తానని, ఈ లోపు సమస్యల‌న్నీ పరిష్కరించుకొని పనులు ప్రారంభించినట్లు తెల‌పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article