Breaking News

రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలి

కామారెడ్డి, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర సమయంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ రక్తదానం చేశారు. బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన రవీందర్‌ రెడ్డికి ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. రక్త లేమితో ఎస్‌విఆర్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రవీందర్‌ రెడ్డికి టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ రక్త దానం చేశారు. అలాగే పోసానిపెట్‌ గ్రామానికి చెందిన గోగు నవీన్‌ రెడ్డి కూడా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఏనుగందుల‌ నవీన్‌ మాట్లాడుతూ టీజీవిపి విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల‌ పరిష్కారం కొరకై కాకుండా ఇలాంటి సేవ కార్యక్రమంలో ముందు ఉంటుందని యువకులు రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాల‌ని కోరారు. కార్యక్రమంలో టీజీవిపి నాయకులు భూంపల్లి భూపాల్‌, ఆఫ్రోజ్‌, రనిల్‌ రెడ్డి, ప్రభుత్వ హాస్పిటల్‌ టెక్నిషన్‌ అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article