Breaking News

ఇంధన చార్జీలు పెంచడం దుర్మార్గం

ఆర్మూర్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల‌కు నిరసనగా వేల్పూరు మండల‌ కేంద్రంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ మరియు ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్‌ సతీష్‌ రెడ్డికి వినతి పత్రం అందించారు.

ధర్నానుద్దేశించి ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు భయబ్రాంతుల‌కు గురవుతుంటే మరో దిక్కు మోడీ ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు పెంచి అదనపు భారం వేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో టెస్టులు ప్రజలందరికీ నిర్వహించి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల‌ని, అదేవిధంగా లాక్‌డౌన్ కాలంలో 300 యూనిట్లు కరెంటు వినియోగించిన కుటుంబానికి విద్యుత్ బిల్లు ప్రభుత్వమే భరించాల‌ని దాసు కోరారు.

చిన్నతరహా మధ్యతరహా పరిశ్రమల‌కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాల‌ని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఉపాధి లేక కొనుగోలు శక్తి బల‌హీనపడి బాధపడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అదనంగా ప్రజల‌పై సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. ధర్నాలో ఐఎప్‌టియు జిల్లా కమిటీ సభ్యులు సుంకరి శ్రీనివాస్‌, రాస ల‌క్ష్మీనారాయణ, వర్ణ రెడ్డి, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు వి సూరిబాబు, ఎస్‌ వెంకటేష్‌, పివైయల్‌ నాయకులు ధర్మపురి, సోయాబ్‌, ఇస్మాయిల్‌ పటేల్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష ...

Comment on the article