Breaking News

నిర్లక్ష్యం… నిర్లక్ష్యం… నిర్లక్ష్యం…

కామారెడ్డి, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండ గడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన చేయటానికి వస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల ల‌క్మి నారాయణా, బాణాల ల‌క్ష్మారెడ్డిల‌ను అరెస్ట్‌ చేసి దేవున్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డిని ఉదయం 9 గంటల‌కు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 20 మంది బీజేపీ కార్యకర్తల‌ను అరెస్ట్‌ చేసి కామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెండల ల‌క్మి నారాయణ మాట్లాడుతూ కరొనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫల‌మైందని, ఇప్పటి వరకు 57 వేల‌ టెస్టులు మాత్రమే చేసి దేశంలో అట్టడుగు స్థానంలో ఉందని, ఒక్క గాంధీ ఆసుపత్రిలో తప్ప ఎక్కడ కరోనాకి ఆసుపత్రి లేకపోవటం వ‌ల్ల‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు.

సరిjైున మాస్కులు, పిపిఇ కిట్లు అదించక పోవటం వ‌ల్ల‌ డాక్టర్లు కరొనా రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, పోలీసులు అధికారులు కూడా మహమ్మారి బారిన పడ్డారన్నారు. అన్ని హంగుల‌తో ఏర్పాటు చేస్తామన్న గచ్చిబౌలి హాస్పిటల్‌ ఇంతవరకు ప్రజల‌కు అందుబాటులోకి రాలేదని, కేంద్రం విడుదల‌ చేసిన వేల‌ కోట్ల రూపాయలు, ప్రజలు విరాళాలుగా ఇచ్చిన సొమ్ముతో ఏమి చేశారో అర్ధం కావటం లేదన్నారు.

ల‌క్షణాలున్న వారిని కూడా టెస్టు చేయకుండా హోమ్‌ క్వారెంటెన్‌లో ఉంచుతున్నారు తప్ప టెస్టు చేయటం లేదని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుందని కరొనా పాజిటివ్‌ వాళ్ళని చేర్చుకోవటంలో నిర్లక్ష్యం, చేరిన వాళ్లకు చికిత్స చేయటంలో నిర్లక్ష్యం, చని పోయిన రోగిని కుటుంబ సభ్యుల‌కు అప్పగించటంలో నిర్లక్ష్యం, ఇలా అన్నిట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

Check Also

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, ...

Comment on the article