Breaking News

23న ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు

నిజామాబాద్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ మంగళవారం 11 కెవి రాజరాజేంద్ర ఫీడర్‌ పైన విద్యుత్‌ పనుల‌ నిమిత్తం విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్ని ఎక్స్‌ రోడ్డు, ఆనంద్‌నగర్‌, సీతారాంనగర్‌, మానిక్‌భవన్‌, చక్రంగుడి ప్రాంతాల‌లో ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్‌ నిలిపివేయడం జరుగుతుందన్నారు.

అలాగే 11 కె.వి. గాజుల్‌పేట్‌ పీడర్‌ పైన గల‌ బోయిగల్లి, గాజుల్‌పేట్‌, బ్రహ్మపురి రెండవ టౌన్‌ పోలీసు స్టేషన్‌, గురుద్వారా, బర్కత్‌పుర, బురుడుగల్లి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల‌ నుండి సాయంత్రం 6 గంటల‌ వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందన్నారు.

విద్యుత్‌ వినియోగదారులు గమనించి సహకరించాల‌న్నారు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article