Breaking News

6 పాజిటివ్‌, 18 నెగిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నుంచి పంపిన 24 నమూనాలో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 18 నెగిటివ్‌గా వచ్చిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పట్టణంలోని అశోక్‌ నగర్ కాల‌నీ, కామారెడ్డి -1 కేసు, వాసవి నగర్ కాల‌నీ, కామారెడ్డి- 1 కేసు అజామ్‌ పురా కాల‌నీ, కామారెడ్డి- 1 కేసు, సదాశివ నగర్‌ – 2 కేసు జనగామ ( బిబిపేట్‌ మండలం)- 1 కేసు నమోదైనవన్నారు. వీరంతా ఇటీవల‌ వచ్చిన 3 పాజిటివ్‌ కేసుల‌ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తుల‌ని, వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారన్నారు. కానీ ప్రజల‌ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా వుండాల‌న్నారు.

ఇంకా కొన్ని రోజుల పాటు ప్రయాణాలు ఫంక్షన్‌ల‌కు, విందుల‌కు దూరంగా వుంటూ సామాజిక దూరం పాటిస్తూ, స్వచ్ఛందంగా ప్రజలు లాక్‌ డౌన్‌ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇట్టి కేసుల‌ పట్ల అప్రమత్తంగా వుండి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతుందని, కనుక జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి తగు సహకారం అందించాల‌న్నారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article