Breaking News

మహిళ సంఘాల‌కు కోవిడ్‌-19 రుణాలు

నిజామాబాద్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ శాఖ ఎస్‌హెచ్‌జి బ్యాంక్‌ లింకేజీ మరియు కోవిడ్‌ రుణాల‌పై జిల్లా కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏ.పి.యం మరియు సి.సి ల‌తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేటికి 15 వేల‌ 334 సంఘాలు గాను 7 వేల‌ 739 సంఘాల‌ డాక్యుమెంట్స్‌ బ్యాంకుకు సమర్పించడం జరిగిందని, మిగతా సంఘాల‌ డాక్యుమెంట్లు కూడా ఈ నెల‌ 29 నాటికి బ్యాంకుల‌కు సమర్పించాల‌ని ఆదేశించారు.

నేటికి కేవలం 31 శాతం మాత్రమే కోవిడ్‌ ఋణం సంఘాలు అందించడం జరిగిందని, ఈ నెల‌ 29 నాటికి 100 శాతం ప్రగతి సాధించాల‌ని ఆదేశించారు. అలాగే సిసిఎల్‌ క్రింద ఎస్‌హెచ్‌జి బ్యాంక్‌ లింకేజీలో 2695 సంఘాల ల‌క్ష్యానికి గాను 1272 సంఘాల‌కు మాత్రమే ఇప్పించడం జరిగిందన్నారు. ఈ రుణాలు కూడా ఈ నెలాఖరుకు 100 శాతం ఇప్పించాల‌ని ఆదేశించారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు అన్ని మహిళ సంఘాల‌కు రుణాలు ఇప్పించాల‌ని బ్యాంకు నుండి ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాల‌ని ఆదేశించారు.

ఇందల్వాయి, రెంజల్‌, ఎడపల్లి మండలాలు కోవిడ్ – 19 రుణ పంపిణీ ఆశించిన స్థాయిలో లేనందున పనితీరును మెరుగుపరుచుకోవాల‌ని, అదే విధంగా సిసిఎల్‌ రుణ పంపిణీలో మెండోర, బాల్కొండ, ముప్కాల్‌ మండలాల‌లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేనందున పనితీరును మెరుగుపరుచుకోవాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీలో మంచి పనితీరు కనబరిచిన కమ్మర్‌పల్ల్లి, రుద్రూర్‌, ఆర్మూర్‌ మండలాల‌ సిబ్బందిని అభినందించారు.

అలాగే స్త్రీనిది రుణాల‌ రికవరి గురించి సమీక్ష చేస్తూ ఎన్‌పిఏ అవుట్‌ స్టాండిరగ్‌ అధికంగా ఉన్నా బోధన్‌, ఎడపల్లి, వేల్పూర్‌ మండలాల‌లో ఈ నెల‌ 29 వరకు 50 శాతం అదేవిధంగా జూలై 15 నాటికి 100 శాతం రికవరీ సాధించాల‌ని దీంతో పాటు స్త్రీనిధి రుణ ల‌క్ష్య సాధనకు కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. డిఆర్‌డివో రాథోడ్‌ రమేష్‌, ఎల్‌డిఎం జయ సంతోష్‌, డిపిఎం నీలిమ, శ్రీనిధి ఆర్‌ఎం అనంత కిషోర్‌ వివిధ మండలాల‌ ఏపిఎంలు, సిసిలు పాల్గొన్నారు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article