Breaking News

దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించారు

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యంలో జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలి దాన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అంటూ సమైక్య భారతం కోసం ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్యజించిన భారత మాత ముద్దు బిడ్డ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అని, దేశ విభజన అనతరం దేశంలో జరుగుతున్న అరాచక పాల‌న చూసి ఓర్వలేక తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అక్టోబర్‌ 21 1951 లో భారతీయ జనసంఫ్‌ు ప్రారంభించారన్నారు.

జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుడు అంకురార్పన చేశారని, ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించి ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని, హిందువులు, ముస్లిముల‌కు ఒకే విధమైన పౌర స్మృతి ఉండాల‌ని నినదించి ముందుకు సాగాడని అన్నారు.

వారు స్థాపించిన పార్టీ నేడు మహావృక్షంగా విస్తరించడం ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని.. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాల‌ని ఉద్యమించి 1953లో కాశ్మీర్‌ వెళ్ళి నిరాహారదీక్ష చేయాల‌ని నిర్ణయించి సరిహద్దు వద్ద మే 11 న అరెస్టు అయ్యాడన్నారు. జూన్‌ 23, 1953 న కస్టడీలోనే ముఖర్జీ ప్రాణాలు వదిలాడని, బలిదానం సందర్భంగా కాశ్మిర్‌ లో ఆర్టికల్‌ 370 .. 35 (ఎ) తీసివేయడమే శ్యామ ప్రసాద్‌ ముఖేర్జీకి మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఘన నివాళి అన్నారు.

Check Also

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, ...

Comment on the article