Breaking News

ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జన్‌ సంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన దివస్‌ సందర్భంగా మంగళవారం ఆర్మూర్‌ జర్నలిస్ట్ కాల‌నీ లోని 19 వ వార్డులో 20 మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాల‌నీవాసులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ మరియు స్థానిక వార్డు కౌన్సిల‌ర్‌ జీవి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ భారతంలో కల‌పడానికి మరియు 370 ఆర్టికల్‌ రద్దు విశేషంగా కృషి చేసిన శ్యామ్‌ ప్రకాష్‌ ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పని చేయాల‌ని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చాల‌ని డిమాండ్‌ చేశారు. జన్‌సంఫ్‌ులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసి వారు దేశానికి విశేష కృషి చేశారన్నారు.

పార్టీ నిర్మాణంలో ఒకరైన శ్యామ్‌ ప్రకాష్‌ ముఖర్జీ అడుగుజాడల్లో నడవాల‌ని తెలిపారు. దేశం కోసం ధర్మం కోసం పాటుపడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ నిర్మాణానికి కృషి చేయాల‌ని జన్‌సంఫ్‌ు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి ఈరోజు దేశంలోనే ఆదరాభిమానాలు పొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో 19 వ వార్డు ఇంఛార్జి గటడి నితిన్‌ కుమార్‌, కాల‌నీ వాసులు గడ్డం శంకర్‌, బోండ్ల గోపి, సతీష్‌, బాజన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష ...

Comment on the article