Breaking News

సమస్య ఏదైనా పరిష్కారమయ్యేలా చూస్తా

నిజామాబాద్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎన్‌డిసిసి బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లతో పిఏసిఎస్‌ కంప్యూటరీకరణ మరియు లావాదేవీల‌పై, బ్యాంక్‌ లోన్‌ రికవరీ పై మరియు బ్యాంక్‌ సమస్యల‌పై, కోవిడ్‌-19 పై, సమీక్ష సమావేశం నిర్వహించారు.

మొదట కోవిడ్‌-19 గురించి తగిన జాగ్రత్తలు, బ్యాంకుకి వచ్చే కస్టమర్లు లోనికి వచ్చే ముందు మాస్కు ధరించేలా చూసి, చేతుల‌ను సానిటైజ్‌ చేసుకోవడానికి స్యానిటైజర్‌ బాటిల్స్‌ అమర్చేలా చూడాల‌ని, మరియు బ్యాంక్‌ సిబ్బంది కచ్చితంగా మాస్కు ధరించాల‌ని ఎప్పటికప్పుడు స్యానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాల‌ని బ్యాంకు మేనేజర్లకి సూచించారు.

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల‌లో రోజువారీ జరిగే లావాదేవిల‌న్నీ కంప్యూటరీకరణ చెయ్యాల‌ని ఆదేశించారు. ఇకపై ప్యాక్స్‌ కంప్యూటరీకరణ, మరియు లావాదేవీలు డీసీసీబీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎస్‌ఏవో, ఎల్‌టి లోన్లతో పాటు ఇతర లోన్లన్ని పూర్తిగా నెలాఖరులోగా రికవరీ చెయ్యాల‌ని మేనేజర్లకు సూచించారు. బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే, అది ఎటువంటిదైన తన వద్దకు తీసుకువస్తే తగిన చర్యలు తీసుకొని సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సిఈఓ సుమమాల‌, జిఎంలు అనుపమ, లింబాద్రి, డిజిఎంలు, ఏజిఎంలు, అన్ని బ్రాంచు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article