Breaking News

నలుగురికి షోకాజు నోటీసులు

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరవ విడత హరితహారానికి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, దోమకొండ, బీబీపేట మండలాల‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి రహదారుల‌కు ఇరువైపులా మూడు వరుసల‌ మొక్కలు నాటాల‌ని సూచించారు.

పల్లె ప్రగతి 10 ప్రమాణాల‌ను ప్రతి గ్రామపంచాయతీ పాటించే విధంగా చూడాల‌ని కోరారు. గత హరితహారంలో నాటిన మొక్కల‌ను రక్షించాల‌ని కార్యదర్శుల‌ను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాల‌ని కోరారు. మొక్కలు నాటేందుకు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం పార్కును ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఉపాధి హామీ పనుల‌కు ప్రతిరోజు 50 శాతం కూలీలు హాజరయ్యే విధంగా చూడాల‌ని పేర్కొన్నారు. గ్రామాల్లోని డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠ దామం చుట్టూ రక్షణ కంచెగా మొక్కలు నాటాల‌ని కోరారు. అడ్లూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద మొక్కలు నాటే స్థలాల‌ను కలెక్టర్‌ పరిశీలించారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ పాటిల్‌, డిఆర్‌డివో చంద్ర మోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న, రామారెడ్డి ఇ ఎంపీడీవో శంకర్‌ నాయక్‌, తహసీల్దారు బాబా షరీఫుద్దీన్‌, సదాశివనగర్‌ ఎంపీడీవో అశోక్‌, తహసిల్దార్‌ రవీందర్‌, దోమకొండ ఎంపీడీవో చెన్నారెడ్డి, తహసిల్దార్‌ అంజయ్య, బిబిపేట ఎంపీడీవో నారాయణ, తహసిల్దార్‌ నరసింహులు, అధికారులు పాల్గొన్నారు.

నలుగురు గ్రామపంచాయతీ కార్యదర్శుల‌కు షోకాజు నోటిసులు జారీ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ అధికారుల‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల‌ను సక్రమంగా చేపట్టనందుకు రామారెడ్డి మండలం ఉప్పల్వాయి కార్యదర్శి, అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలు సక్రమంగా పెంచనందున దోమకొండ మండలం లింగుపల్లి, దోమకొండ, అంచనూర్‌ పంచాయతీ కార్యదర్శుల‌కు షోకాజ్‌ నోటీసుల‌ను జారీ చేయాల‌ని ఆదేశించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article