Breaking News

దంపతుల‌ రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్‌ గ్రామానికి చెందిన ఉప్పు నర్సవ్వకు ఆపరేషన్‌ నిమిత్తం 3 యూనిట్ల ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. పూర్వ టీజీవిపి లింగంపేట్‌ అధ్యక్షుడు మద్దికుంట మహేష్‌ గౌడ్‌, అతని భార్య నవ్య సేవా దృక్పధంతో ఇద్దరు రక్తదానం చేశారు.

అలాగే కామారెడ్డికి చెందిన సతీష్‌ కూడా బి పాజిటివ్‌ రక్తం అందించారు. కార్యక్రమంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌, ఉప్పు నరేష్‌, రాజు విటి ఠాగూర్‌ రక్త నిధి టెక్నీషియన్‌ చందన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article