Breaking News

Daily Archives: June 25, 2020

అధ్యాపకుడి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన అధ్యాపకుడు జగదీష్‌ గురువారం జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అధ్యాపకుడు జగదీష్‌ను అభినందించారు. అన్ని దానాలో కెల్లా రక్త దానం గొప్పదని రక్తదానం చేయడం వ‌ల్ల నలుగురు ప్రాణాల‌ను కాపాడే అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో సమూహ సభ్యులు కిరణ్‌, రాజు, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Read More »

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష పార్టీల‌ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గురువారం కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించాల‌ని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంసిపిఐయు, ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, ఎస్‌. వెంకట్‌ గౌడ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ ...

Read More »

రాజకీయ ప్రత్యర్థుల‌ను జైలు పాలు చేశారు

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెల‌ల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారని, భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల‌ స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్‌ ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ద్వారా 1975 జూన్‌ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల‌కు అధికారికంగా విధింపజేశారని బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు బస్వా ల‌క్ష్మీ ...

Read More »

వర్షాన్ని డబ్బుతో కొనలేం…

ఆర్మూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం పచ్చల‌ నడుకుడ గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌ మేరకు హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్‌ శ్వేత గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ఆరు సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని, ...

Read More »

దోమల‌ బెడద తగ్గించటానికి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నిర్మూల‌నకు దోమల‌ బెడద తగ్గించటానికి ఫాగ్గింగ్‌ మెషీన్లను జోన్‌ కార్యాల‌యాల‌కు నగర మేయర్‌ దండూ నీతుకిరణ్‌ అందజేశారు. నగర ప్రజల‌కు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి గురువారం నగరంలోని 6 మున్సిపల్‌ జోన్లకు 2 చొప్పున దోమల‌ మందు మెషిన్లను మొత్తం 12 మెషీన్లు అందించారు. దోమల‌ మెషీన్ల ద్వారా ప్రతి రోజు 12 డివిజన్లలో దోమల‌ మందు స్ప్రే చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. నిలువ ఉన్న నీళ్లలో దోమలు ...

Read More »

టార్గెట్‌ పూర్తిచేశాము…

డిచ్‌పల్లి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో తెలంగాణకు హరితహారం – 2020 కార్యక్రమాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం ఉదయం గెస్ట్‌ హౌస్‌ ఎదుట మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – చెట్లే ప్రగతికి తొలి మెట్లుగా అభివర్ణించారు. టీయూ క్యాంపస్‌లో 2014 నుంచి ఇప్పటి వరకు నిర్విగ్నంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నో ల‌క్షల‌ మొక్కల‌ను నాటామని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి రక్షణ, పోషణ కల్పించామని, అవి ...

Read More »

హరితహారం ప్రారంభించిన పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నసురుళ్లబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో సొసైటీ గోదాం ప్రహారి గోడ వద్ద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, కామారెడ్డి డీసీఓ శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ పాల్తే ల‌క్ష్మీ విట్ఠల్‌, ఎంపీపీ విట్ఠల్‌, జడ్పీటీసీ జన్నుభాయి ప్రతాప్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పెరిక శ్రీనివాస్‌, సుదీర్‌, మారుతి, మాజి జడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌, ...

Read More »

మనల్ని మనం చంపుకున్నట్టే ….

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్‌ కార్యాల‌యం ఆవరణంలో ఆరవ విడత హరితహారం ప్రారంభించి, కార్యక్రమంలో భాగంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు. గత 5 సంవత్సరాలుగా హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతున్నారని, గతంలో అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటే ...

Read More »