Breaking News

మనల్ని మనం చంపుకున్నట్టే ….

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్‌ కార్యాల‌యం ఆవరణంలో ఆరవ విడత హరితహారం ప్రారంభించి, కార్యక్రమంలో భాగంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు.

గత 5 సంవత్సరాలుగా హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతున్నారని, గతంలో అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుతంలోని అన్ని శాఖలు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. కేవలం కామారెడ్డి ఒక్క జిల్లాకే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కలుపుకుని మొదటి సంవత్సరం 80 కోట్లు, రెండవ సంవత్సరం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, చెట్లు పెంచుకుంటే మన పిల్ల‌ల్ని పెంచుకున్నటే, చెట్లను చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టే అన్నారు.

రాజకీయాల‌కు అతీతంగా హరిత హారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల‌న్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌,ఎంపీ బి.బిపాటిల్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజుల‌ సురేందర్‌, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ దఫెదర్‌ శోభా రాజు, పంచాయితీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌, ఎస్పీ శ్వేతా ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article