Breaking News

రాజకీయ ప్రత్యర్థుల‌ను జైలు పాలు చేశారు

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెల‌ల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారని, భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల‌ స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్‌ ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ద్వారా 1975 జూన్‌ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల‌కు అధికారికంగా విధింపజేశారని బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు బస్వా ల‌క్ష్మీ నర్సయ్య అన్నారు.

ఈ మేరకు గురువారం స్థానిక పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. 1977 మార్చి 21లో ఉపసంహరించే వరకూ కొనసాగిందని, ఆదేశాల‌ ద్వారా పరిపాలిస్తూ ఎన్నికల‌ను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఈ ఆర్డర్‌ అందించిందన్నారు. ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థుల‌ను జైలుపాలు చేసి, పత్రికల‌ను సెన్సార్‌ చేశారని, ప్రధానమంత్రి కుమారుడు సంజయ్‌ గాంధీ ముందుండి నడిపిన మాస్‌-స్టెరిలైజేషన్‌ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు కూడా నివేదితం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి అని, విపక్షాల‌కు చెందిన పు నేతల‌ను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారన్నారు. అదే కాలంలో భారతీయ జనసంఫ్‌ు ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారని గుర్తుచేశారు.

1977లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాలు వల‌న భారతీయ జనసంఫ్‌ుతో పాటు భారతీయ లోక్‌దళ్‌, కాంగ్రెస్‌ (ఓ), సోషలిస్ట్‌ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఎన్నికల‌లో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించిందని అన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article