Breaking News

టార్గెట్‌ పూర్తిచేశాము…

డిచ్‌పల్లి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో తెలంగాణకు హరితహారం – 2020 కార్యక్రమాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం ఉదయం గెస్ట్‌ హౌస్‌ ఎదుట మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – చెట్లే ప్రగతికి తొలి మెట్లుగా అభివర్ణించారు. టీయూ క్యాంపస్‌లో 2014 నుంచి ఇప్పటి వరకు నిర్విగ్నంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నో ల‌క్షల‌ మొక్కల‌ను నాటామని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి రక్షణ, పోషణ కల్పించామని, అవి చక్కగా పెరుగుతూ పచ్చని అటవీ ప్రాతాన్ని తల‌పిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2018 మరియు 2019 సంవత్సరాల‌లో 1 ల‌క్ష 10 వేల‌ 825 మొక్కలు నాటే టార్గెట్‌ ఇచ్చారని, మొక్కలు నాటి టార్గెట్‌ పూర్తి చేశామని తెలిపారు. ఈ సంవత్సరం 5 వేల‌ 400 మొక్కల‌కు గెస్ట్‌ హౌస్‌, యూనివర్సిటి కాలేజ్‌, వీసీ రెసిడెన్సీ పరిసర ప్రదేశాల‌ను ఎంచుకొని నాటుతున్నామని పేర్కొన్నారు.

వేప, మర్రి, చింత, ఉసిరి, జిట్టగన్నేరు, నెమలినార, నారవేప, కుంకుడు, బ్రొచెర, అ్లనేరేడు, కనుగు, నిద్రగన్నేరు, గుల్మోరా, కదంబ తదితర మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి ఎంపిడిఓ సురేందర్‌, కంట్రోర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌, పీఆరో డా. వి. త్రివేణి, డిచ్‌పల్లి ఏపిఓ ఓం కార్‌, ఏఇ వినోద్‌ కుమార్‌, ఏఆర్‌ సాయాగౌడ్‌, సూపరింటెండెంట్‌ భాస్కర్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ యాదగిరి, తోటమాలి బ్రహ్మయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article