Breaking News

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష పార్టీల‌ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గురువారం కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించాల‌ని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంసిపిఐయు, ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, ఎస్‌. వెంకట్‌ గౌడ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ మాట్లాడారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, ధరల‌ను తగ్గించాల‌ని, ఇప్పటికి దేశంలో దాదాపుగా 16 సార్లు పెరగడం సిగ్గు చేటన్నారు. ప్రపంచంలో ఓ వైపు క్రూడ్‌ ఆయిల్ ధరలు తగ్గినా ఇక్కడ అధికంగా పెట్రోల్ ధరలు పెంచడం సరైంది కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, పై పన్నును వెంటనే తగ్గించాల‌ని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల‌లో ప్రజలు ఆకలితో చస్తుంటే మరో వైపు ప్రభుత్వాలు ప్రజల‌కు మరింత భారం మోపే ప్రయత్నలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించకుంటే వీటి ప్రభావం సామాన్య, మధ్య త‌ర‌గ‌తి ప్రజల‌పై బస్‌, ఆటో చార్జీలు, ఇతర అన్ని రంగాల‌పై పడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి ఉందన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పెట్రోల్‌, డిజిల్‌, పై ధరలు తగ్గించాల‌ని లేదంటే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు చంద్ర శేఖర్‌, మోతీరేం, సీపీఐ జిల్లా నాయకులు ఎస్‌ ఆర్‌ శేఖర్‌, శ్రీరామ్‌, నరేష్‌ కుమార్‌, మణికంఠ, రవి, తదితరులు ఉన్నారు.

Check Also

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, ...

Comment on the article