Breaking News

దోమల‌ బెడద తగ్గించటానికి

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నిర్మూల‌నకు దోమల‌ బెడద తగ్గించటానికి ఫాగ్గింగ్‌ మెషీన్లను జోన్‌ కార్యాల‌యాల‌కు నగర మేయర్‌ దండూ నీతుకిరణ్‌ అందజేశారు. నగర ప్రజల‌కు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి గురువారం నగరంలోని 6 మున్సిపల్‌ జోన్లకు 2 చొప్పున దోమల‌ మందు మెషిన్లను మొత్తం 12 మెషీన్లు అందించారు. దోమల‌ మెషీన్ల ద్వారా ప్రతి రోజు 12 డివిజన్లలో దోమల‌ మందు స్ప్రే చేయటం జరుగుతుందని పేర్కొన్నారు.

నిలువ ఉన్న నీళ్లలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశమున్నందున ఖాళీ స్థలాల్లో నీరు నిలువ కుండా చూసుకోవాల‌ని ప్రజల‌కు సూచించారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల‌ సహకారం అవసరమని ప్రతి ఒక్కరు చుట్టు పక్కల‌ పరిసరాలు శుభ్రం ఉంచుకోవడం ద్వారా వ్యాధుల‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి. పాటిల్‌, ఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాస్‌, జోన్ల ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article