Breaking News

అమరవీరుల‌కు కాంగ్రెస్‌ సలాం

బీర్కూర్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పూర్వ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, అలాగే టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అమర వీరుల‌కు కాంగ్రెస్‌ సలాం అనే కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీర అమర జవానుల‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనాతో ప్రజలు చని పోతుంటే మరో వైపు, భారత చైనా సరిహద్దులో 20 మంది జవానులు అమరులైనారని, అందులో మన రాష్ట్రానికి చెందిన సూర్యాపేట ముద్దు బిడ్డ క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు అమరుడైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు చైనా ఆర్మీ దళాల‌ చేతిలో మరణించిన మన భారత సైనికుల‌కు అమర వీరుల‌కు కాంగ్రెస్‌ సలాం అంటూ నినాదాలు చేశారు. చైనా మన భూభాగంలోకి చొరబడి దురాక్రమణ చేసినా మన ప్రధాని ఎందుకు స్పందించడంలేదో సమాధానం చెప్పాల‌ని డిమాండ్‌ చేసారు. అదే విధంగా అమరవీరుల‌ కుటుంబాల‌ను అన్నీ విధాలా ఆదుకొని, వీర జవానుల‌ మృతికి ప్రతీకారంగా చైనా దళాల‌ను మట్టి కర్పించి అమరవీరుల‌ ఋణం తీర్చుకోవాల‌ని డిమాండ్‌ చేసారు.

కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, కామారెడ్డి జిల్లా ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌, బీర్కూర్‌, బాన్సువాడ మండల‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పోగు నారాయణ, శంకర్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌ సానెపు గంగారాం, మాజీ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు రాచప్ప పటేల్‌, రామ్మోహన్‌ మీర్జా పూర్‌, ఎండీ నసీమొద్దీన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పోగు పాండు, ఓబీసీ మండల‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్ల బస్వారాజ్‌, టౌన్‌ అధ్యక్షుడు నాగరాజు, పోతు వెంకటేశం, అహ్మద్‌ హుస్సేన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పోగు పాండు, ఖదీర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, ఎన్‌ఆర్‌ఐ రషీద్‌ అన్వర్‌, అహ్మద్‌ భాషా, అఖిలేష్‌ గౌడ్‌, మాజీ ఎంపిటిసి శేఖర్‌ గౌడ్‌ మాజీ వార్డు మెంబర్‌ డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష ...

Comment on the article