Breaking News

మూడవ విడత ‘దిశ’ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ విడత దిశ సమావేశం నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో నిర్వహించారు. సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌ మేరకు క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుమార్‌ ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ఎంపీ కలెక్టరేట్‌ నందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ గత డిసెంబర్‌ నుండి దిశ సమావేశం నిర్వహించడం అనేక కారణాల వ‌ల్ల‌ వాయిదా వేయవల‌సి వచ్చిందన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ, ఐహెచ్‌హెచ్‌ఎల్‌, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, హౌజింగ్‌, రెండు పడక గదుల‌ ఇళ్ళు, ఆర్‌అండ్‌బి, పిఆర్‌ రోడ్లు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, కోవిడ్‌`19, జాతీయ రహదారులు పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు అడిగిన వాటికి, కొత్త ఫ్యామిలీస్‌ వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకుంటే వారికి మంజూరు ఉంటుందని తెలిపారు.

గ్రామాల‌లో కమ్యూనిటీ టాయిలెట్స్‌ నిర్మాణానికి 10 శాతం గ్రామ పంచాయతీ నిధుల‌ నుండి భరిస్తే 90 శాతం ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. రెండు పడక గదుల‌ ఇళ్ళ పనుల‌పై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్బన్‌లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్‌ వెనకాల‌ డ్రైనేజీ వాటర్‌, వర్షం నీటి వల‌న పనులు ఆల‌స్యం జరుగుతుందని, వాటిని మళ్లించి వెంటనే నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు.

ఇసుక 8 మండలాల‌ నుండి 29 మండలాల‌కు అందివ్వాల‌ని అందుకే ఆల‌స్యం జరుగుతుందన్నారు. మంజీర నుండి జిల్లాలో 8 రీచ్లకు 6.5 క్యూసెక్కు ఇసుక ఉందన్నారు. 15 నుండి 20 రోజుల్లో ప్రోగ్రెస్‌ వస్తుందన్నారు. ఆర్‌అండ్‌బి. సిఆర్‌ఎస్‌ ఫండ్స్‌తో చేస్తున్న 5 పనులు ప్రారంభమయ్యాయని, అందులో 4 పూర్తి అయినవని తెలిపారు. మామిడిపల్లి రోడ్డు, బోధన్‌ నుండి నిజామాబాద్‌ రోడ్డు, రోడ్లు గుంతలు పూడ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌ని అన్నారు.

పంచాయతీ రాజ్‌ రోడ్లు ప్యాచ్‌ వర్క్‌ చేయాల‌న్నారు. వైద్యం ఆరోగ్యం, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవాలు 2253, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో 1921 ప్రసవాలు జరిగినవన్నారు. సభ్యులు కోవిడ్‌ గురించి అడగగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నుండి పక్క రాష్ట్రాల‌ నుండి వచ్చిన వారి నుండి పాజిటివ్‌ కేసులు వస్తున్నవని, ప్రతి ఒక్కరు కోవీడ్‌ జాగ్రత్తలు పాటించాల‌న్నారు. సోమవారం నుండి ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌ పరీక్షల‌కు ల్యాబ్‌ ప్రారంభిస్తామని తెలిపారు.

జిల్లా నుండి మైగ్రేటెడ్‌ లేబర్‌ కుటుంబాల‌కు రెండు విడతలుగా ప్రతి ఒక్కరికి 500 చొప్పున 21 ల‌క్షల‌ 53 వేలు అందించడం జరిగిందని తెలిపారు. ఆత్మ నిర్మల్‌ భారత్‌ కింద ఐదు కేజీల‌ బియ్యం, రెండు కేజీల‌ పప్పు పంపిణీ 2016 షాపుల్లో జరుగుతున్నదని తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా 530 గ్రామపంచాయతీల‌లో డంపింగ్‌ యార్డ్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. 530 వైకుంఠ దామాల‌కుగాను 453 పూర్తయినవని అన్నారు.

82 ల‌క్షల‌ మొక్కలు ఆరో విడత హరితహారం ప్రణాళికలో నాటాల్సి ఉండగా కోటి ఎనిమిది ల‌క్షల‌ మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హరితహారం జూలై ఐదో తేదీ వరకు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. రైతు పొలాల్లో కళ్ళాలు నిర్మించుకోవటానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటితో ముగుస్తుందని, కొత్తగా ఏర్పడ్డ తాండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాల‌ని సభ్యులు కోరగా అందుకు జిల్లా కలెక్టర్‌ గ్రామంలో అంగన్‌వాడి భవనం, పంచాయతీ భవనం కలిపి నిర్మించే విధంగా ఆలోచన ఉందన్నారు.

సోయా సీడ్‌ మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర కంపెనీలు కోవిడ్‌ లాక్‌ డౌన్‌ కారణంగా సప్లై చేయనందున అవసరానికి సీడ్‌ ఇతర ఏజెన్సీల‌తో తీయడం వ‌ల్ల‌ నిజామాబాద్‌ / నిర్మల్‌ / సంగారెడ్డి జిల్లాలో డ్యామేజ్‌ జరిగిందన్నారు. సోయా రైతుకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఆర్డీవో పిడి రమేష్‌ రాథోడ్‌, సంబంధిత శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article