Breaking News

భూభాగాల‌కు రక్షణ లేకుండా చేశారు

కామారెడ్డి, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం అఖిల‌ భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల‌ మేరకు అమర జవాన్లకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నివాళులు అర్పించి మౌనం పాటించారు. గాంధీ గంజ్‌లో గాంధీ విగ్రహానికి పూల‌మాల‌ వేసి అమరవీరులు క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబుకు మరియు ఇతర జవాన్లకు జాతీయ జెండాతో నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ దేశం కోసం అమరులైన వీరుల‌ కుటుంబాల‌కు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన దేశ ప్రధాని చౌకిదార్‌ అంటూ మన దేశ భూముల‌కు రక్షణ లేకుండా చేసారని, ఈ వైఖరి తోనే మన దేశ సైనికుల‌ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. దీనిపై వెంటనే దేశ ప్రధాని చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు గుప్తా, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఫ్లోర్‌ లీడర్‌ చాట్ల రాజేశ్వర్‌, పట్టణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడుగు శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్స్‌ అన్వర్‌ హైమద్‌, అంజాద్‌, చింత రవీందర్‌ గౌడ్‌, పాక రవిప్రసాద్‌, పాత శివకృష్ణ మూర్తి, షేరు, పంపరి శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి ధాత్రిక సత్యం, గోనే శ్రీనివాస్‌, జొన్న నర్సింలు, ప్రతిభ రమేష్‌, డాక్టర్‌ వెంకటి గజవాడ శెంకర్‌, కటిపల్లి రామ్మోహన్‌, పాత రాజయ్య, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్‌ వల్లిపిశెట్టి భాస్కర్‌, పడిహర్‌ కిరణ్‌, గంప ప్రసాద్‌, నితీష్‌, మొహమ్మద్‌ సర్వర్‌, పెన్సిల్‌ వార్‌ శ్రీకాంత్‌, పిప్పిరి చందు, మధు, అహీమాద్‌ ఉల్లా, ఇర్ఫాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, ...

Comment on the article