Breaking News

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను అడ్డుకుని దళిత కుటుంబాల‌న్నింటిని సామాజిక బహిష్కరణ చేయడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ జిల్లా కలెక్టర్‌ అసిస్టెంట్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, బిఎల్‌ఎప్‌ జిల్లాకన్వీనర్‌ జబ్బర్‌, బిఎల్‌పి పార్టీ జిల్లా కన్వీనర్‌ సదానందం మాట్లాడుతూ గ్రామంలో 93 దళితకుటుంబాల‌ను గ్రామంలో ఉన్న అగ్రవర్ణ భూస్వాములు విడిసి కలిసి సామాజిక బహిష్కరణ చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

జిల్లా అధికారులు వారికి నోటీసు ఇచ్చిన తరువాత కూడా మార్పు లేదని ఆక్షేపించారు. దళితులు ఉపాధిలేక రోడ్డున పడ్డారని వీరిపై అనాగరికంగా వేధిస్తున్న వారిపై తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టరు, స్థానిక శాసన సభ్యులు కృషిచేయాల‌ని లేకుంటే తాము చేపట్టబోయే భారీ ఆందోళనకు అధికారులు గ్రామ విడిసి బాధ్యత వహించాల‌ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మద్దెల‌ రాజు, తిరుపతి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, ...

Comment on the article