Breaking News

Daily Archives: June 27, 2020

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో శనివారం జిల్లా ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫారెస్ట్‌ అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రతి గ్రామంలో 2 వేల‌ మొక్కలు నాటి వాటి సంరక్షణకు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద అన్ని గ్రామ పంచాయతీల‌లో పనిచేయుటకు ఐదుగురిని సోమవారంలోగా నియమించాల‌న్నారు. వారితో బుష్‌ కటింగ్‌, రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు తొల‌గించే ...

Read More »

ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌ గ్రామాన్ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. శనివారం ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైనేజీలు, రోడ్లు, హరితహారం కార్యక్రమంలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్‌, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. ఈ ...

Read More »

చెత్తబుట్టల‌ పంపిణీ

బాన్సువాడ, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ మండలం, తాడ్కోల్‌, బుడిమి గ్రామాల‌లో 6వ విడత హరితహారం కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. తాడ్కోల్‌ గ్రామంలో హరిజనవాడ హనుమన్‌ మందిరం వద్ద అలాగే బుడ్మి గ్రామంలోని గ్రామపంచాయితీ వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, గ్రామంలోని ప్రజల‌కు చెత్త బుట్టలు అందచేశారు. కార్యక్రమములో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామ్‌ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, ...

Read More »

విద్యార్థుల‌కు న్యాయం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరోన సమయంలో పాఠశాల‌ విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరెట్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించి, డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల‌ పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల‌లో జరుగుతున్న ఫీజుల‌ దోపిడీని నియంత్రించాల‌ని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా సమయంలో అధిక ఫీజు వసూలు ...

Read More »

నాట్లు వేయడానికి ఇతర గ్రామాల‌కు వెళ్లొద్దు

బీర్కూర్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల‌ ప్రజలు ప్రస్తుతం ఇతర మండల‌ములో కరోన వ్యాది వ్యాపిస్తున్నందున ప్రజలు నాట్లు వేయటానికి ఇతర గ్రామాల‌కు వెళ్లవద్దని, ఉపాది హామి పథకంలో తమ యొక్క గ్రామములో పనిచేసుకునే విదంగా అనేక రకాల‌ పనులు మంజూరు చేయబడినవని యం.పి.డి.ఓ భోజారావు తెలిపారు. కావున బీర్కూర్‌ మండలంలోని అన్ని గ్రామాల‌ ఉపాది కూలీలు ఉపాది హామి పనికి తమ గ్రామ పంచాయతీలో హాజరు కావాల‌ని తెలిపారు.

Read More »