Breaking News

ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్‌, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌ గ్రామాన్ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. శనివారం ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైనేజీలు, రోడ్లు, హరితహారం కార్యక్రమంలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్‌, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌తో మాట్లాడుతూ స్టేట్‌ విజిలెన్స్‌ టీమ్స్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారులు ఎప్పుడైనా మీ గ్రామానికి రావొచ్చని, రోడ్లు మురుగు కాలువ‌లు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల‌తో ప్రతిరోజూ శుభ్రం చేయించాల‌ని తెలిపారు.

గ్రామపంచాయతీ నుండి ఐదుగురిని నియమించుకొని గ్రామంలో రోడ్లపై చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేయించాల‌న్నారు. వీరికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నుండి రోజుకి 237 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మురుగు కాలువల్లో చెత్త వేయరాదని, వేసిన వారికి జరిమానా విధించాల‌న్నారు. గ్రామంలోని కాలి ఫ్లాట్లలో పాములు ఉండే ప్రమాదముందని, మొక్కలు తొగించే విధంగా ప్లాట్‌ దారునికి తెలియజేయాల‌ని, ఒకవేళ గ్రామపంచాయతీ నుండి తొల‌గిస్తే అయిన ఖర్చు అతని నుండి రికవరీ చేయాల‌న్నారు. తాగునీరు పైపుల‌కు ఎక్కడ లీకేజీ ఉండరాదన్నారు.

ఇన్స్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌లో ప్రతి వెయ్యి మొక్కల‌ను సంరక్షించడానికి ఒకరిని, అవెన్యూ ప్లాంటేషన్‌ సంరక్షణకు ప్రతి 400 మొక్కల‌కు ఒకరిని నియమించుకోవచ్చని, వీరితో సరిగ్గా పని చేయించాల‌నీ ఏపీఓను ఆదేశించారు. వైకుంఠధామాలు 530 జిపిల‌కు గాను 528 పూర్తయినాయని, తాళ్ల రాంపూర్‌, ఏర్గట్లలో జూన్‌ 30 కి పూర్తిచేయాల‌ని గ్రామ సర్పంచ్‌ను ఆదేశించామన్నారు. వైకుంఠ దామాల‌ అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం ఉండాల‌ని, సిట్టింగ్‌ బెంచీలు, ఫౌంటెన్‌ గ్రీన్‌పార్కులో ఏర్పాటు చేయాల‌ని, ఐరన్‌ ఫెన్సింగ్‌ 50 మీటర్లు, మిగతాది గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయాల‌న్నారు.

అనంతరం నర్సరీ సందర్శించి, నర్సరీలో పెద్ద మొక్కల‌ను ముందు డిస్ట్రిబ్యూషన్‌ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సందర్శించారు ఎరువులు, విత్తనాలు, వరి ధాన్యం గురించి అడిగి తెలుసుకున్నారు. చెత్త రీసైక్లింగ్‌ గురించి వివరించారు.

కార్యక్రమంలో ఎంపీపీ కోలిప్యాక ఉపేందర్‌ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్‌, తాళ్ళ రాంపూర్‌ సొసైటీ చైర్మన్‌ పెద్ద కాపు శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల‌ అధ్యక్షుడు రాజ పూర్ణ నందం, ఏర్గట్ల సొసైటీ వైస్‌ చైర్మన్‌ సింగాసారం గంగారాం, స్థానిక సర్పంచ్‌ భాను ప్రసాద్‌, ఎంపీడీవో రాజేశం, తాసిల్దార్‌ సురేష్‌, ఏపీవో వెంకటేష్‌ గ్రామ సెక్రెటరీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ ...

Comment on the article