Breaking News

చెత్తబుట్టల‌ పంపిణీ

బాన్సువాడ, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ మండలం, తాడ్కోల్‌, బుడిమి గ్రామాల‌లో 6వ విడత హరితహారం కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. తాడ్కోల్‌ గ్రామంలో హరిజనవాడ హనుమన్‌ మందిరం వద్ద అలాగే బుడ్మి గ్రామంలోని గ్రామపంచాయితీ వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, గ్రామంలోని ప్రజల‌కు చెత్త బుట్టలు అందచేశారు.

కార్యక్రమములో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామ్‌ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సంగ్రామ్‌ నాయక్‌, కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, తాడ్కోల్‌ గ్రామ సర్పంచ్‌ రాజమని రాజు, ఉపసర్పంచ్‌ బండ సంగారెడ్డి, బుడమి గ్రామ సర్పంచ్ ల‌క్ష్మీ నాందేవ్‌, ఉపసర్పంచ్‌ నభి, నాయకుడు భూషణ్‌ రెడ్డి, దొడ్ల వెంకటరామ్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, విట్ఠల్‌ రెడ్డి, ల‌క్ష్మ రెడ్డి, వార్డ్‌ సభ్యుడు, ఎంపీటీసీలు, అధికారులు, గ్రామస్థులు ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దేగాంలో వ్యాక్సినేషన్‌ అభియాన్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాక్సినేషన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం దేగాం ...

Comment on the article