Breaking News

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో శనివారం జిల్లా ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫారెస్ట్‌ అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రతి గ్రామంలో 2 వేల‌ మొక్కలు నాటి వాటి సంరక్షణకు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద అన్ని గ్రామ పంచాయతీల‌లో పనిచేయుటకు ఐదుగురిని సోమవారంలోగా నియమించాల‌న్నారు. వారితో బుష్‌ కటింగ్‌, రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు తొల‌గించే పని చేయించాల‌ని తెలిపారు.

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల‌న్నారు. పూర్తయిన 400 డంపింగ్ యార్డుల‌ను వెంటనే ఉపయోగంలోకి తేవాల‌న్నారు. కంపోస్ట్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ అన్ని గ్రామాల‌లో సోమవారం నుండి వాడకంలోకి తీసుకురావాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. డోర్‌ టు డోర్‌ తడి చెత్త, పొడి చెత్త క్రింద విడదీసి సేకరించాల‌ని, ఉపాధి హామీలో కూలీల‌కు 237 రూపాయలు వచ్చే విషయాన్ని వారికి అవగాహన కలిగేలా ఫ్లెక్సీల‌ ద్వారా, పాంప్లెంట్ల ద్వారా తెలియజేయాల‌న్నారు.

సోమవారం వరకు ఫ్లెక్సీలు గ్రామపంచాయతీల‌ వద్ద, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనిచేసే స్థలం వద్ద ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రస్తుతం రోజుకి 60 వేల‌ మంది పని చేస్తున్నారని, ఫీల్డ్‌ లెవల్లో చేపట్టే పనులు ఊరికి, పబ్లిక్కి ఉపయోగపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

వైకుంఠధామం నిర్మాణంలో గ్రామస్తుల‌ భాగస్వామ్యం ఉండాల‌న్నారు. వైకుంఠధామనికి ఐరెన్‌ ఫెన్సింగ్‌ 50 మీటర్స్‌, పశువులు రాకుండా ఉండేందుకు మిగతాది గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్ లత, డిఆర్డిఓ రమేష్‌ రాథోడ్‌, జెడ్‌పి సీఈవో గోవింద్‌ సంబంధిత శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article