Breaking News

విద్యార్థుల‌కు న్యాయం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరోన సమయంలో పాఠశాల‌ విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరెట్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించి, డీఈఓకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల‌ పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల‌లో జరుగుతున్న ఫీజుల‌ దోపిడీని నియంత్రించాల‌ని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా సమయంలో అధిక ఫీజు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాల‌ని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్స్‌ నిర్వహిస్తున్న పాఠశాలల‌ గుర్తింపు రద్దు చేయాల‌ని, కరోనా ప్రత్యేక పరిస్థితుల‌ దృష్ట్యా పాఠశాల‌ విద్యలో ఫీజులు, అడ్మిషన్స్‌, బోధన పై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాల‌ని కోరారు. అలాగే కరోనా సమయంలో ఉపాధ్యాయుల‌ను తొల‌గించిన ప్రైవేటు, కార్పోరేట్‌ విద్యాసంస్థల‌పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని, బ్రాండ్‌ పేరుతో కరోనా వలే తెలంగాణ పల్లెకు విస్తరిస్తున్న కార్పొరేట్‌ పాఠశాల‌ల మాఫియాను నిషేధించాల‌న్నారు.

Check Also

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ ...

Comment on the article