Breaking News

జూలై 10 వరకు ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని రెండవ, నాలుగ‌వ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు జూలై 10వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆల‌స్య రుసుముతో జూలై 15వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చన్నారు.

పరీక్షలు జూలై / ఆగస్ట్ నెల‌లో నిర్వహింపబడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా దరఖాస్తు పత్రాన్ని ఆన్‌ లైన్‌ లోనే పూర్తి చేసి ఆయా కళాశాల‌ల ప్రధానాచార్యుల‌కు పంపవల‌సిందిగా తెలిపారు. కావున పీజీ కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించవల‌సిందిగా కోరారు. పూర్తి వివరాల‌ కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవల‌సిందిగా సూచించారు.

Check Also

తెంగాణలో కరోనా పరీక్షలు చేసే ల్యాబులివే…

హైదరాబాద్‌, జూన్‌ 16 (నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌) అపోలో హాస్పిటల్స్‌ లాబొరేటరీ సర్వీసెస్‌, జూబ్లీ హిల్స్‌ విజయ డయాగ్నొస్టిక్‌ ...

Comment on the article