Breaking News

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌య ఆవరణలో ఆయన చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పండ రాజు మాట్లాడారు.

దేశంలో పివి నరసింహారావు భూ సంస్కరణల‌ ద్వారా పేద రైతుల‌కు, ఆర్థిక సంస్కరణల‌ ద్వారా పేద ప్రజల‌కు, ఎన్నో సేవ‌లు అందించిన గొప్ప మహానుభావుడు అని, అదేవిధంగా విద్యారంగంలో నవోదయ పాఠశాల‌లు ఏర్పాటు చేసి పేద విద్యార్థుల‌కు ఉచిత చదువును అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. మన రాష్ట్రంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇటు రాష్ట్రాభివృద్ధికి అటు దేశాభివృద్ధికి కృషి చేశాడన్నారు.

కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్లు చాట్ల రాజేశ్వర, రవీందర్‌ గౌడ్‌, శివ, సయ్యద్‌ అన్వర్‌, షేరు, మాజీ కౌన్సిల‌ర్లు గోనె శ్రీనివాస్‌, బట్టు మోహన్‌, నాయకులు మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సిరాజుద్దీన్‌, ధాత్రిక‌ సత్యం, ప్రతిభ రమేష, హైమద్‌ ఉల్లా కాకర్ల శేఖర, భాస్కర్‌, సత్యం, సర్వర్‌, హలీం, ల‌క్క పతిని గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ...

Comment on the article