Breaking News

బహుభాషా కోవిదుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాల‌యంలో మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీ.వీ. నరసింహారావు శతజయంతి వేడుకలు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ పి.వి.నరసింహారావు చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ దివంగత ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞత, మానవీయ విలువల‌తో పాటు, పరిపాల‌నా దక్షత, ఆర్థిక సంస్కరణతో కూడిన ప్రజా పాల‌న ఆయన సొంతమని కొనియాడారు. అంతేకాకుండా తెలంగాణ వాసి కావడం మన గర్వకారణమని అభివర్ణించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాథ్‌ .టి, నిజామాబాద్‌ అదనపు డి.సి.పి (ఎల్‌ అండ్‌ ఓ) రఘువీర్‌, ఆర్మూడ్‌ రిజర్వు డి.సి.పి (ఏ.ఆర్‌) భాస్కర్‌, నిజామాబాద్‌ ఏ.సి.పి జి శ్రీనివాస్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏ.సీ.పీ ప్రభాకర్‌ రావు, రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ రామాంజనేయులు, శైలందర్‌, ఆర్‌ .ఎస్‌. ఐ ు, సి .పి. ఓ కార్యాల‌యం సిబ్బంది మరియు పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు.

Check Also

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, ...

Comment on the article