Breaking News

అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారు

మాక్లూర్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల‌ బిజెపి సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలా శివరాజ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. బిజెపి ఎదుగుదల‌ను చూసి ఓర్వలేక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, వారి మాటల‌ను ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ నిధుల‌ను దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుల‌కు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాల‌ని సవాల్‌ విసిరారు. అలాగే ఎంపీ దిశ సమావేశం కేంద్ర ప్రభుత్వ నిధుల‌ గురించి ఆరా తీయగా టిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్ళు నములుతూ మొఖం ఎక్కడ పెట్టాలో తెలియలేదని దుయ్యబట్టారు.

గడిచిన సంవత్సరంలోనే ఎంపి స్పైస్‌ బోర్డు ల‌క్కంపల్లి సెజ్‌ను ప్రారంభించి ముందుకు పోతున్న తరుణంలో కరోనా మహమ్మారి వల‌న మొత్తం స్తంభించిందని, అది మన దురదృష్టంగా భావించాల‌న్నారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం ద్వారా 20 ల‌క్షల‌ కోట్ల ప్యాకేజీ దేశ ప్రజల‌కు చెందాల‌నే సదుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల‌ జేబుల్లోకి నయాపైసా రాలేదని అక్కసుతో నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్‌, మండల‌ అధ్యక్షుడు వినోద్‌, బీజేవైఎం అధ్యక్షుడు సూర శ్రీకాంత్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

బిల్లు రద్దుచేసి ప్రజల‌ను ఆదుకోవాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ...

Comment on the article